AP: ఓడిపోతామనే భయంతోనే వైసీపీ దాడులు

AP: ఓడిపోతామనే భయంతోనే వైసీపీ దాడులు
జగన్‌ ప్లాన్‌ బీ ప్రవేశపెట్టారన్నశ్రీకృష్ణదేవరాయులు... గొడవలకు పోలీసులు ఆజ్యం పోస్తున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం జగన్ ప్లాన్ Bని ప్రవేశ పెట్టారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. భారీగా పోలింగ్ శాతం నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయులు ఆరోపించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా మూకలు దాడులు చేస్తున్నా... పోలీసులు చోద్యం చూడటం దారుణమని మరో నేత వర్లరామయ్య దుయ్యబట్టారు. పోలీసులు ఇంకా సీఎం జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారని..మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. వైకాపా నేతలు చేస్తున్న విధ్వంసంపై...... గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఆనంద్ బాబు తెలిపారు.


తాడిపత్రిలో గొడవలు అదుపు చేయాల్సిన పోలీసులు..మరింత ఆజ్యం పోస్తున్నారని తెలుగుదేశం మండిపడుతోంది. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో.... వంట మనుషులు, పని మనషులను పోలీసులు కొట్టారని ఆరోపించింది. జేసీ ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న తనను అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారని... దివ్యాంగుడు దాసరి కిరణ్ తెలిపారు. డీఎస్పీ చైతన్యతోపాటు పోలీసులు..... లాఠీలతో చావబాదారని కిరణ్ ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత తాడిపత్రి ఆసుపత్రికి.... ఆ తర్వాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిరణ్ తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు పల్నాడు జిల్లాలో వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.... మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. 1800 మంది పోలీసులు... పహారా కాస్తున్నారు. మాచర్ల M.L.A. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న కారంపూడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. గురజాల M.L.A. కాసు మహేష్ రెడ్డి మాచవరం మండలం కొత్తగణేశునిపాడు వెళ్లి..అనుచరులతో కలిసి బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... మాచర్ల, కారంపూడిలో 1200 మందిని మోహరించారు. పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు. మాచర్లలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక గురజాల M.L.A. కాసు మహేష్ రెడ్డిని... నరసరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలోనూ..పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. M.L.A. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి అరవింద్ బాబు ఇళ్ల వద్ద..... పోలీసులను మోహరించి వారిని బయటకు రావొద్దని సూచించారు.

Tags

Next Story