కూటమి బంధం బలమైంది.. ఏపీ అభివృద్ధికి తిరుగే లేదు..

కూటమి బంధం బలమైంది.. ఏపీ అభివృద్ధికి తిరుగే లేదు..
X

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధం రోజురోజుకూ మరింత బలంగా మారుతోంది. ఎన్నికల తర్వాత మూడు పార్టీల మధ్య సమన్వయం బలపడుతోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. కూటమి నాయకులు ఒకే లక్ష్యంతో – అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత అభివృద్ధిలో వేగం పెరిగింది. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.

సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతుండటంతో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. రాజధాని అభివృద్ధి కూడా గణనీయంగా జరుగుతోంది. అమరావతిని గ్లోబల్ స్టాండర్డ్ సిటిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ పడుతున్న కష్టం అందరికీ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే, ఈ పాలన ఇంకో పదిహేనేళ్లు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం మీద, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి బంధం బలపడటమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి దిశలో తిరుగులేని వేగం అందుకుంది.

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ ఏపీని సర్వనాశనం చేసింది. ఆ నష్టాన్ని ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ పూడుస్తోంది. కాబట్టి ఇప్పట్లో మళ్లీ వైసీపీకి ఛాన్స్ ఇవ్వొద్దని అంటున్నారు కూటమి నేతలు. ఒకే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటే చాలా రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి అభివృద్ధి చాలా అవసరం. 16 నెలల్లోనే ఇంత చేస్తే.. అదే 15 ఏళ్లు కూటమి ఉంటే ఇండియాలోనే ఏపీ స్పీడ్ గా డెవలప్ అయిన స్టేట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలని అంటున్నారు కూటమి నేతలు.

Tags

Next Story