CM Chandrababu : ఇది ప్రజా ప్రభుత్వం.. కష్టపడి పనిచేస్తాం: చంద్రబాబు

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడో సంతకం పెట్టినట్లు చంద్రబాబు ( N. Chandrababu Naidu ) పెనుమాక సభలో వెల్లడించారు. ‘వీటిల్లో రూ.5కే భోజనం చేయవచ్చు. త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కోసం శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. నిరంతరం కష్టపడి పనిచేస్తాం. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించాలి’ అని కోరారు.
ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా.. గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు
మరోవైపు ఈనెల 4వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులపై సీఎం వారితో చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. విభజన హామీల అమలుపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com