Tiger : కారును ఢీకొట్టిన పెద్ద పులి

Tiger : కారును ఢీకొట్టిన పెద్ద పులి
X

నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందుభాగం ధ్వంసంకాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పులి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంతవరకూ తమకు పెద్దపులి సంచారం కనిపించలేదని, ఇదే మెుదటి సారిగా పులి ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. ఆ పులి ఇతర ప్రాంతాల నుంచి ఇటువైపు వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. అయితే, పులి సంచారం వార్తల నేపథ్యంలో కదిరినాయుడుపల్లెలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు.

Tags

Next Story