AP : నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

AP : నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
X

వైఎస్ జగన్ ( YS Jagan ) అధ్యక్షతన నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన జగన్.. నేడు మరోసారి అందరితో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ దాడులు, ఈవీఎంలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి వైఎస్ జగన్‍‌ సహా 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అలాగే నాలుగు లోక్ సభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది

Tags

Next Story