AP: నేడు ఎన్నికల సంఘం ముందుకు ఏపీ సీఎస్.. డీజీపీ

హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ.... ఇప్పటికే సమన్లు పంపిన ఈసీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లోనూ, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరికీ ఈసీ సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలున్నప్పటికీ పోలింగ్ రోజు అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు అధికారులు ఇవాళ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
పలనాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనేపలనాడు సహా వేర్వేరు ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై.... వివరణ కోరుతూ సీఎస్ కు, డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఈసీ సమన్ల నేపథ్యంలో సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ CS జవహర్ రెడ్డితోఅత్యవస రంగా సమావేశమయ్యారు. ఎన్నికల అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించినట్లు సమాచారం.
పోలింగ్ తర్వాతజరిగిన హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా... స్పష్టంచేశారు. పోలింగ్ తర్వాత హింస జరిగిన చోట.. 144 సెక్షన్ విధించామన్నారు. పోలింగ్ సందర్భంగా హింసకు దిగినవారిని, తర్వాత అల్లర్లకు కారణమైన వారందరినీ...జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేసినట్టు CEO వెల్లడించారు. పోలింగ్ రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై.. త్వరలో చర్యలుంటాయని సీఈఓ మీనా చెప్పారు.
తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి,నరసరావుపేటలో హింసాత్మక ఘటనలు జరిగాయని..ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా చెప్పారు. ఆ ప్రాంతాలకు సీనియర్ అధికారితో అదనపు బలగాలు పంపామన్నారు. పోలింగ్ రోజున కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్న మీనా.... కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని.. గుర్తించామన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేపనిలో డీజీపీ సహా అధికారులు ఉన్నట్లు.. వెల్లడించారు. హింసకు పాల్పడినవారి ఆధారాలు ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని..... మీనా తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి జైలులో పెట్టాలని... ఇప్పటికే ఆదేశించామన్నారు. చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేశామని... ఇవాళ అందరినీ అరెస్టు చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com