Car Accident : ప్రకాశంలో ఘోరం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు బోల్తా పడి ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద ఈ ఘటన జరిగింది.
ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరై కందుకూరు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సూరారెడ్డి పాలెం రహదారిపై డివైడర్ ని కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఉండటంతో ఢీకొట్టిన వెంటనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు స్పాట్ లోనే కన్నుమూశారు.
కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతులు గుల్లపల్లి శ్రావణి, కలపనేని దివ్య, రాయని అరుణగా గుర్తించారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com