MLC Candidates : ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా SVSN వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతోపాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు టాక్. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎమ్మెల్యే ల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. వైసీపీ పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. C.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com