TDP : ఓట్ ఫర్ సైకిల్.. రాజకీయ పెళ్లి పత్రిక

ఈ మధ్య వివాహ ఆహ్వాన పత్రికల్లో తమకు ఇష్టమైన నేతలపై అభిమానాన్ని చాటుకునేందుకు కొందరు ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు (Achanta) చెందిన ఓ పెళ్లి పత్రిక వైరలవుతోంది. కారెం సంజయ్ వివాహం చంద్రికారాణితో జరగనుంది. మాజీ మంత్రి, ఆచంట టీడీపీ (TDP) అభ్యర్థి పితాని సత్యనారాయణపై ఉన్న అభిమానాన్ని అతడు వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా చాటుకున్నారు.
ఈ క్రమంలో పత్రికపై తన అభిమాన నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలను ముద్రించి పంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పనిలో పనిగా ‘మన ఆచంట మన పితాని ఓట్ ఫర్ సైకిల్’ అంటూ ఆహ్వాన పత్రిక కవర్ పేజీపై పేర్కొన్నారు.
ఇదిలావుంటే పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. బాపట్ల పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో భేటీ అయిన జంగా.. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలోనే గురజాలలో జరిగే శంఖారావం సభలో జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా గురజాల వైసీపీ టికెట్ కోసం జంగా ప్రయత్నించగా.. కాసు మహేశ్‌రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com