AP : ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తాం: లోకేశ్

తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బుజ్జగింపు కాదని, సామాజిక న్యాయమని నారా లోకేశ్ చెప్పారు. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. 20ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తాము మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి SC, ST, BCలకు ఇస్తామని మోదీ, అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
అటు YCP ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసి, ఆపై ఆధారాలను ధ్వంసం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం మాకందరికీ తెలుసు. నా ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగిందని గతంలో చెప్పాను. నా ఫోన్‌పై రెండుసార్లు పెగాసస్ అటాక్ జరిగిందనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చివరగా ఏప్రిల్‌లో అటాక్ అయింది’ అని ANI ఇంటర్వ్యూలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com