AP : తప్పు ఎక్కడ జరిగింది?.. వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న
151 MLAలున్న జగన్ పార్టీని ప్రజలు 11 సీట్లలోనే గెలిపించడంతో తప్పు ఎక్కడ జరిగిందనేది వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. వైసీపీ కంచుకోటల్లోనూ కూటమి అభ్యర్థులు బంపర్ మెజార్టీలు సాధించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా 90% వైసీపీ ఓట్లు, ఆ పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ కూటమికి మెజార్టీ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ పై ఇంత వ్యతిరేకతకు గల కారణాలు మీరు ఏమని అనుకుంటున్నారు.
అటు జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుధవారం సీబీఐ కోర్టు ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి టీ రఘురాం విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. డిశ్చార్జి పిటిషన్‌లలో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేశారు.
అటు వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com