YS Jagan : జగన్ వెనుక గేట్ నుంచి ఎందుకెళ్లారు?

YS Jagan : జగన్ వెనుక గేట్ నుంచి ఎందుకెళ్లారు?
X

MLAగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) తడబడ్డారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో తన పేరును పలకడంలో జగన్ తడబాటుక గురయ్యారు. తొలుత వైఎస్ జగన్ మోహన్ అనే నేను అన్ని పలికిన ఆయన తర్వాత జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణాన్ని కొనసాగించారు.

అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. వెనక గేట్ నుంచి సభలోకి వచ్చారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదగా అసెంబ్లీకి వచ్చే ఆయన ఇప్పుడు వెనకమార్గం నుంచి లోపలకు ప్రవేశించడం చర్చకు దారితీసింది. ఇంకోవైపు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటెం స్పీకర్ ను కలిసిన వైఎస్ జగన్ ఆ తర్వాత సభ్యులకు నమస్కరిస్తూ ముందుకు వచ్చారు.

ఈ సమయంలో ఆయన నమస్కారానికి ప్రతి నమస్కారం చేసేందుకు అచ్చెన్నాయుడుతోపాటు మరికొంతమంది సభ్యులు లేచేందుకు ప్రయత్నించగా చంద్రబాబు వారిని కూర్చోవాలని సూచించారు. ఆ తర్వాత సభ నుంచి జగన్ బయటకు వెళ్లిపోయారు. వచ్చిన మార్గంలోనే వెనక మార్గం నుంచే బయటకు వెళ్లారు జగన్.

Tags

Next Story