TDP: తెలుగుదేశంలోకి కొనసాగుతున్న చేరికలు

TDP: తెలుగుదేశంలోకి కొనసాగుతున్న చేరికలు
వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులతో పార్డీని వీడుతున్న నేతలు.... వైసీపీ పతనం ప్రారంభమైందన్న కీలక నాయకులు...

ఒక పక్క నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల నియామకాల్లో వైసీపీ అధిష్టానం తర్జన బర్జన పడుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు తెదేపాలో చేరారు. అనపర్తి మాజీ M.L.A. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. మాజీ మంత్రి చినరాజప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విజయనగరంలో టీడీపీలోకి వైసీపీ నేతల వలసల పర్వం జోరందుకుంది. పట్టణంలోని 43 వ డివిజన్ లో వైసీపీకు చెందిన 50 కుటుంబాలు నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు సమక్షంలో పార్టీలో చేరారు. అదితి గజపతి రాజు పార్టీ కండువా కప్పి ,సాధరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పాలనకు శ్రీకారం , మహిళా సాధికారతకు కృషి చేయగల వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని ఆమె తెలిపారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదితి గజపతి రాజు సూచించారు.


మరోవైపు సత్యసాయి జిల్లా కదిరిలో స్థానిక సంస్థల వైసీపీ ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. 16మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా లేఖను కమిషనర్ కు అందించారు. ఇప్పటికే కదిరి, గాండ్లపెంట MPTC, సర్పంచులు వారి రాజీనామా పత్రాలను స్థానిక MPDOకు సమర్పించారు. వారితోపాటు ఆలయ ధర్మకర్తలు, మండలి పాలకవర్గ సభ్యులు రాజీనామాలు చేశారు. కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాదని.... మక్బూల్ అహమ్మద్ కు అప్పగించడంతో వైకాపా నేతలు నిరసిస్తూ... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ఇంఛార్జ్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాపట్ల జిల్లాలోని వైసీపీఎమ్మెల్యే కోన రఘుపతిపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ.... Z.P.T.C సభ్యురాలు సురేఖ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం రఘుపతికి సీటు ఇస్తే మేమంతా... తెలుగుదేశం పార్టీలో చేరుతామన్నారు. ఎమ్మెల్యే రఘుపతి దళిత వర్గానికి చెందిన మమ్మల్ని పలుమార్లు అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకున్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story