AP: వైసీపీ కార్యాలయం కూల్చివేత

AP: వైసీపీ కార్యాలయం కూల్చివేత
బంధనలకు విరుద్ధంగా ఉండడంతో అధికారుల చర్యలు... నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్న అధికారులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఈ వేకువ జామున పోలీసుల పహారా మధ్య పడగొట్టేశారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసీపీ కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఎంటీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇది ఫస్ట్‌ ఫ్లోర్‌ శ్లాబ్ వేయడానికి సిద్ధమవుతున్న టైంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని తాను అధికారంలో ఉన్నప్పడు పార్టీకి తక్కువ లీజుతో కట్టబెట్టారని అది చట్టవిరుద్దమనే ఇప్పుడు చర్యలు తీసుకున్నామని అధికార టీడీపీ చెబుతోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా పేర్కొంటున్నారు.


కూల్చే టైంలో నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. సీఆర్డీఏ అధికారులు కూల్చే టైంలోనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తొందరపాటు చర్యలు వద్దని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే అధికారులు పని పూర్తి చేశారు. దీనిైప వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉందన్న కారణంతోనే కూల్చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు


అధికారం అండతో తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్‌ కేటాయించుకున్నారు. 2 ఎకరాల్లో భవనాలు కట్టి.. మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు. సీఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైసీపీకు హ్యాండోవర్ చేయలేదు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో చంద్రబాబు శాంపిల్‌గా చూపించారని మాజీ సీఎం జగన్‌ అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యులంతా ఈ ఘోరాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని జగన్‌ ట్వీట్‌ చేశారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని అన్నారు. ఏపీలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని తెలిపారు. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని... ప్రజల తోడుగా గట్టిపోరాటాలు చేస్తామన్నారు.

Tags

Next Story