AP : షర్మిల మార్క్ రాజకీయం.. అరెస్టులతో టాక్ ఆఫ్ ఆంధ్రగా మారిన లీడర్

AP : షర్మిల మార్క్ రాజకీయం.. అరెస్టులతో టాక్ ఆఫ్ ఆంధ్రగా మారిన లీడర్

ఏపీలో (AP) కాంగ్రెస్ ను (Congress) మళ్లీ టాక్ ఆఫ్ ద స్టేట్ గా (Talk Of The State) మార్చే పనిలో సీరియస్ గా పనిచేస్తున్నారు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి చేపట్టినప్పటి నుంచి సొంత అన్నపైనే విమర్శలతో రాజకీయాల్లో తన మార్క్ చాటుతూ దూసుకుపోతున్నారామెం. పార్టీకి లీడర్,క్యాడర్ ఉన్నా.. వారిని ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆ బాధ్యత భుజాన వేసుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు షర్మిల.

మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ రెడ్డి యువతను మోసం చేశానీ.. చంద్రబాబు ప్రభుత్వం మూడు సార్లు డీఎస్సీ వేసినా అరకొర పోస్టులే ఇచ్చారని షర్మిల అన్నారు. ఇలాంటి సమయంలో మెగా డీఎస్సీ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రకటించింది. మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె ముట్టడికి రెడీ అయ్యారు.

అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే షర్మిల పార్టీ ఆఫీసుకు చేరుకుని పార్టీ ఆఫీసులోనే రెస్ట్ తీసుకున్నారు. అక్కడ్నుంచే సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లనున్నారు. ఎలాగైనా ముట్టడి నిర్వహించి తీరాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని నియంత్రించడానికి కూడా వందల మంది పోలీసుల్ని ఉపయోగించాల్సి వస్తోంది. వైసీపీ దిగజారిపోయిన పరిస్థితి ఇదే సాక్ష్యంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story