Cult Film A : కల్ట్ ఫిల్మ్ A సరికొత్త 4కే ప్రింట్‌తో వస్తున్న ఉపేంద్ర

Cult Film A : కల్ట్ ఫిల్మ్ A సరికొత్త 4కే ప్రింట్‌తో వస్తున్న ఉపేంద్ర
X

ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై గ్రాండ్ గా రీరిలీజ్ అవుతున్న చిత్రం ఏ(A). కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ చిత్రం 1998లో ఓ ట్రెండ్ సెట్టర్. సుమారు 26 ఏళ్ల క్రితం విడుదలైన ఏ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పటి ఆడియన్స్ ను, ఓటీటీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు కొత్త ప్రింట్ తో మూవీస్ ను తీసుకొస్తున్నారు. ప్రభాస్ నటించిన ఛత్రపతి, యోగి చిత్రాలను 4కే లో మళ్లీ విడుదల చేశారు.

ఆ రోజుల్లో 100 రోజులు ప్రదర్శించడమే కాదు దాదాపు 3, 4 వారాలు టికెట్లు సైతం దొరకలేదంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ కల్ట్ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తూ వింటేజ్ రోజులను తెరపై అవిష్కరింపజేస్తున్నారు ప్రొడ్యూసర్ లింగం యాదవ్.

జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఏ మూవీ కన్నడలో రీరిలీజై మంచి వసూళ్లు సాధించింది

Tags

Next Story