Accident : లారీ కిందకు దూసుకుపోయిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

Accident : లారీ కిందకు దూసుకుపోయిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కళ్లు మూసి తెరిచేలోపు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. రాత్రివేళ వెళుతురు సరిగా లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మునగాల మండలం ఉలిక్కిపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. కారు వేగంగా ఉండటం, లారీ టర్నింగ్ దగ్గర పార్క్ చేసి ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story