Reels Leads to Death : రీల్స్ కోసం రివర్స్ చేస్తుంటే లోయలో పడ్డ కారు

కొండపై కారు రివర్స్ చేస్తూ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ఆ కారు లోయలో పడి 23 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని సులిభంజన్ హిల్స్‌పై సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఔరంగాబాద్‌లో ఉండే సూరజ్ సంజౌములే(25), తన స్నేహితురాలు శ్వేతా దీపక్ సర్వసే(23)తో కలిసి కారులో సులిభంజన్ హిల్స్‌కు వెళ్లారు. అక్కడున్న దత్ టెంపుల్‌ను దర్శించుకున్న తర్వాత సరదాగా ఫొటోలు తీసుకున్నారు.
హిల్ వ్యూ పాయింట్లో శ్వేత కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. ఆమె కారును రివర్స్ చేస్తుండగా బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు కొండ మీది నుంచి లోయలో పడిపోయింది. సూరజ్ బ్రేక్ వేయమని అరుస్తూ పరిగెత్తేలోపే ఘోరం జరిగిపోయింది. లోయ 300 మీటర్ల లోతు ఉండటంతో కారు నుజ్జునుజ్జయింది. శ్వేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com