AP : బీచ్‌లో స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి

AP : బీచ్‌లో స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి
X

అనకాపల్లి జిల్లా యలమంచిలి బీచ్ లో దారుణం జరిగింది. తంతడి బీచ్ లో స్నానానికి వెళ్లి ఇద్దరు మహిళలు మృతి చెందారు. చనిపోయిన మహిళలు ఇద్దరు అక్క చెల్లెళ్లు నూకరత్నం, కనకదుర్గగా గుర్తించారు.

పరవాడ మండలం బర్నికంలో గల బంధువుల ఇంటికి వెళ్లారు నూక రత్నం, కనకదుర్గ. అక్కడ నుంచి తంతడి బీచ్ కు ఉల్లాసం కోసం వెళ్లారు అక్కాచెల్లెళ్లు. నూకరత్నం మాకవరపాలెం చెట్టుపాలెంకి చెందిన మహిళ కాగా.. కనకదుర్గ కసింకోట మండలం తీడలో ఉంటోంది. వీరిలో కనకదుర్గకు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

అక్కాచెల్లెళ్ల మరణం, వారి బంధువుల ఆర్తనాదాలు స్థానికులతో కంటతడి పెట్టించాయి.

Tags

Next Story