Tragic Murder : అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య

అమెరికాలో (America) తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా (Guntur) తెనాలి మం. బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ (Abhijit) బోస్టన్ వర్సిటీలో (Boston University) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మార్చి 11న ఆ క్యాంపస్‌లోనే అభిజిత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు. స్నేహితుల ఫిర్యాదుతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. .
నిన్న రాత్రి అభిజిత్ డెడ్ బాడీ స్వగ్రామానికి తీసుకొచ్చారు. అభిజిత్ వయస్సు 20 ఏళ్లు.. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్‌ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది.. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. చదువకోడానికి వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. అభిజిత్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com