Rape and Murder : బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం

బహిర్భూమికి వెళ్లిన యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కర్రలతో తలపై మోది అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ దారుణం ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఓ గ్రామానికి చెందిన యువతి(21) శుక్రవారం తెల్లవారుజామున సమీపంలోని రైలుపట్టాల వైపు బహిర్భూమికి వెళ్లింది.
ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కర్రలతో ముఖంపై బాది హత్యచేశారు. చెవులకున్న కమ్మలు లాక్కెళ్లారు. ఎంతసేపటికీ కుమార్తె ఇంటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తండ్రి వెళ్లి చుట్టుపక్కల వెతికారు. రైలు పట్టాల సమీపంలో కుమార్తె విగతజీవిగా కనిపించింది. మృతురాలిది చేనేత కుటుంబం. ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చింది.
కాగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. యువతి హత్యాచారం విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పాలని అసెంబ్లీలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. దీంతో హోంమంత్రి గ్రామానికి చేరుకుని.. హతురాలి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.. సత్వర సాయం కింద రూ.10 లక్షల పరిహారాన్ని అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com