TTD : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

TTD : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్‌ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

గదుల కోసం సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి, టీబీ, ఏఆర్పీ కౌంటర్ల వద్ద భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా భక్తులతో నిండిపోయాయి. నిన్న స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకోగా.. 36,128 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరోవైపు తెలంగాణ నుంచి తిరుపతికి చాలా మంది భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఎక్కువ. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది. తాజాగా.. తిరుపతి వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నడుస్తోన్న ట్రైన్‌కు నాలుగు రోజులు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వెల్లడించారు.

Tags

Next Story