Ramana Deekshitulu : రమణ దీక్షితులుపై వేటు వేసిన టీటీడీ

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులకు టీటీడీ బిగ్ షాకిచ్చింది. ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయను పదవి నుంచి తొలగించింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని.. తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణదీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com