Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. 18 గంటల టైమ్

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నిన్న స్వామి వారిని 67832 మంది దర్శించుకోగా 25,636 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు లభించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ తిరిగి ప్రారంభమైంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లను బుధవారం నుంచి తిరుపతి విమానాశ్రయంలోనే జారీ చేస్తున్నారు. విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్‌ను తిరిగి ప్రారంభించినట్లు టీటీడీ తెలిపింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com