TTD : తిరుమలలో భక్తుల రద్దీ .. దర్శనానికి 12 గంటల టైమ్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,927 మంది భక్తులు దర్శించుకోగా.. 29,196 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఓ వైపు వేసవి సెలవులు కావడం.. మరోవైపు ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇక గత ఏప్రిల్ నెలలో శ్రీవారిని 20.17 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.101.63 కోట్లు రాగా.. 94.22 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. మరోవైపు ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com