TTD : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

TTD : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు వివిధ సేవలను టీటీడీ రద్దు చేసింది. సాలకట్ల వసంతోత్సవాల సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. సాలకట్ల వసంతోత్సవాల్లో తొలిరోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగి వసంతోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story