TTD : తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

TTD : తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
X

కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది.

మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా శ్రీవారిని దర్శించుకోవటానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Next Story