TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 16 గంటల టైమ్

TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 16 గంటల టైమ్

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది. 26,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story