TTD : తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత

TTD : తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత
X

తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం మళ్లీ కలకలం రేకెత్తించింది. అలిపిరి కాలినడకదారిలోని ఆఖరిమెట్టువద్ద రెండు చిరుత సంచరిస్తుండడంతో చిరుతలను చూసిన భక్తులు బిగ్గరగా కేకలు వేయడంతో అవి అడవిలోకి పారిపోయాయి.

సమాచారం అందుకున్న టిటిడి విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలినడక వస్తున్న భక్తులను అప్రమత్తం చేసి గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నారు.

పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలను తిరుపతి ఫారెస్ట్ అధికారులు మానిటర్ చేస్తున్నారు.

Tags

Next Story