TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ తగ్గింది. కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్న శ్రీవారిని 73,801 మంది భక్తులు దర్శించుకోగా.. 23,055 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఏపీలో ఎండలు ముదురుతుండటంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో వేడి సిమెంటు రోడ్లపై నడిచే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు తమ పాదాలను కాపాడుకోవడానికి భక్తులు జూట్ బ్యాగులను పాదరక్షలుగా ధరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏపీలో ఓవైపు ఎండలు విజృంభిస్తూనే మరోవైపు వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో, ఈ నెల 10, 11వ తేదీల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story