TTD : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
X

వేసవి సెలవులు, వీకెండ్‌ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న కలియుగ వేంకటేశ్వరుడిని 71,510 మంది దర్శించుకున్నారు. 43,199 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చింది.

ఆగస్ట్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేసింది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్‌ డిప్‌లో టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాలి. ఆగస్టు నెలకు సంబంధించి దర్శనం, గదుల టికెట్లను ఈ నెల 23వ తేదీన, రూ.300 స్పెషల్‌ ఎంట్రీ టికెట్లను ఈ నెల 24న అధికారులు విడుదల చేస్తారు.

Tags

Next Story