AP : పాస్ చేయకపోతే చేతబడి చేయిస్తా.. ఆన్సర్ షీట్‌లో స్టూడెంట్ పిచ్చి రాతలు

పరీక్షల్లో మార్కుల కోసం విద్యార్థులు చివరి పేజీల్లో రాసే కామెంట్లు తెగ వైరల్ అవుతుంటాయి. టెన్త్ పరీక్షల్లో అయితే ఇది మరీ మస్ట్ గా కనిపిస్తుటుంది. పాస్ చేయగలరు అంటూ.. రకరకాల కారణాలు రాస్తుంటారు కొందరు విద్యార్థులు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. సరిగ్గా రాయలేదో ఏమో తన జవాబు పత్రంలో తనకు మార్కులు వేయకపోతే.. చేత చేతబడి చేయిస్తానని తెలిపాడు. బాపట్ల జిల్లాలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్నారు. ఆ పేపర్లు దిద్దుతున్న ఓ టీచర్ .. విద్యార్థి రాసిన రాత చూసి షాకయ్యాడు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు.
'నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా' అని ఓ విద్యార్థి రాశాడు. దీంతో.. టీచర్ అవాక్కయిపోయి ఆన్సర్ షీట్‌ను ఉన్నతాధికారులకు చూపించాడు. ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం. రాసిన రాతలపై.. సొంత టాలెంట్ పై నమ్మకం లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలే రాస్తారంటున్నారు టీచర్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com