Prashant Kishor : దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోనుంది :ప్రశాంత్ కిషోర్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోనుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) జోస్యం చెప్పారు. అయితే 370 సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మాత్రం ఆ పార్టీ సాధించలేకపోతోందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా వారాలు మాత్రమే మిగిలి ఉండగా, "తూర్పు, దక్షిణ భారతదేశంలో బీజేపీ అనేక స్థానాలను గణనీయంగా జోడిస్తుంది. తమిళనాడులో ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు.
‘‘తమిళనాడులో ఓట్ల శాతంలో బీజేపీ రెండంకెల స్థానాల్లో ఉండడం తొలిసారిగా నేను చూస్తాననిని ఏడాది క్రితమే చెప్పాను. తెలంగాణలో వాళ్లు (బీజేపీ) మొదటి లేదా రెండో పార్టీ అవుతారన్నది పెద్ద విషయం. ఒడిశాలో కచ్చితంగా నంబర్‌వన్‌గా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నంబర్‌వన్‌గా ఉండబోతోందంటే, మీరు ఆశ్చర్యపోతారు. అయితే , 540 స్థానాలున్న లోక్‌సభలో బీజేపీ 370 సీట్లను అధిగమించే అవకాశం లేదని, ఇది వచ్చే ఎన్నికల్లో కాషాయ పక్షం టార్గెట్ అని ఆయన జోస్యం చెప్పారు.
2014 లేదా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో బీజేపీ ఏకంగా 50 సీట్లను కూడా అధిగమించలేకపోయింది. ఆ పార్టీ 2014లో ఈ రాష్ట్రాల్లో 29 సీట్లు, 2019లో 47 స్థానాలు గెలుచుకుంది. వైఎస్‌ఆర్‌సి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తిరిగి రావడం "కష్టం" అని రాజకీయ వ్యూహకర్త మరింత జోస్యం చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం సహా నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలలో ఈ రాష్ట్రం కూడా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com