Cabinet Meeting : ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సభ్యులంతా రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సాయంత్రం 4 గంటలకు మోదీ నివాసంలో ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హాజరుకానున్నారు.
కాగా, ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పెద్దగా ఏ అంశాలపై చర్చించినప్పటికి తిరిగి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్నికల్లో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపై మోడీ మంత్రి వర్గ సహచరులతో కీలకంగా చర్చిస్తారని సమాచారం.
లోక్‌సభ ఫలితాలపై పాక్ మీడియా ఆచితూచి స్పందించింది. అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ‘ఆశ్చర్యకరంగా తక్కువ మార్జిన్‌తో గెలిచిన మోదీ కూటమి’ అని డాన్ పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ‘రామ మందిరం కట్టిన చోట BJP ఓటమి, ఓటర్లు BJPని శిక్షించారన్న రాహుల్ గాంధీ’ అని బుల్లెట్ పాయింట్లు పెట్టింది. ఇక ఖతర్ కేంద్రంగా నడిచే అల్ జజీరా ‘మెజార్టీ కోల్పోవడం పీఎం మోదీ నేతృత్వంలోని కూటమికి పెద్ద దెబ్బే’ అని హెడ్‌లైన్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com