Rains : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

Rains : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
X

తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూ.గో, ప.గో, ఏలూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.. TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలా యి. అరేబియా సముద్రంలోని ఈశాన్య ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇటు అరేబియా, అటు బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్టు పేర్కొంది. ఇదే ప్రస్తు తం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి కారణమవుతుందని తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదుకాగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది.

Tags

Next Story