Notifiction : దేశంలో నాలుగో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Notifiction : దేశంలో నాలుగో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ, బిహార్‌లో అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ.3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

☞ నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18

☞ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18

☞ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25

☞ నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26

☞ నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29

☞ పోలింగ్- మే 13

☞ ఓట్ల లెక్కింపు- జూన్ 4

☞ ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6

Tags

Read MoreRead Less
Next Story