Katchativu : కచ్చతీవు వివాదం ఏంటి?

Katchativu : కచ్చతీవు వివాదం ఏంటి?

భారత్ – శ్రీలంకను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సమీపంలో ఈ కచ్చతీవు ఉంది. 1.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవిలో ఎవరూ నివసించరు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగే వేడుకల్లో తమిళులు పాల్గొంటారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దీవి రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత్‌లో చేరింది. మత్స్యసంపద ఎక్కువగా ఉండటంతో భారత మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు.

శ్రీలంక మాత్రం ఈ ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదు. మత్స్యకారులను తరుచూ అదుపులోకి తీసుకుంటోంది. న్యాయపరంగా ఈ దీవి అప్పగింత చెల్లదని తమిళనాడులోని పలు పార్టీలు వాదిస్తున్నాయి. భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు సేకరణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story