PM Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది.
అటు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దాదాపుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.53 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం. పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com