Davos : ఒక వేదికపై ముగ్గురు సీఎంలు.. దావోస్ లో ఇంట్రస్టింగ్ సీన్

Davos : ఒక వేదికపై ముగ్గురు సీఎంలు.. దావోస్ లో ఇంట్రస్టింగ్ సీన్
X

దావోస్‌లో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కనిపించి కెమెరాలకు పనిచెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒకే వేదికపై కనిపించారు. ఇక్కడ జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి-సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.

Tags

Next Story