Zelensky Sensational : పుతిన్ చనిపోతాడు... జెలెన్ స్కీ సంచలన ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపో తారని, అప్పుడే యుద్ధం ముగిసి పోతుందని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ కామెంట్ ప్రాధాన్యత సంతరిం చుకుంది. పుతిన్ దగ్గుతు న్నట్లు, ఆయన కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే చర్చ జరిగింది. అయితే, ఆ వీడియోలోని దృశ్యాలు 2022 నాటివని సమా చారం. గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక కథనా లు వచ్చాయి. వాటిని పుతిన్ అప్పుడే ఖండించారు. అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై వదంతులను క్రెమ్లిన్ కూడా తోసి పుచ్చింది. ఇప్పుడు జెలె న్ స్కీ చేసిన వ్యాఖ్య లపై మాస్కో నుంచి ఎలాం టి ప్రతిస్పందన రాలేదు. మరోవైపు ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల చేసిన ప్రతిపా దనకు ఇప్పటికే ఉక్రెయిన్ అంగీకరించింది. ఇక రష్యాను కూడా ఒప్పించేందు అగ్రరాజ్యం ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. సౌదీ వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com