U.S. : అమెరికాలో తెలుగమ్మాయి మృతి

U.S. : అమెరికాలో తెలుగమ్మాయి మృతి
X

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల వి.దీప్తి మరణించారు. ఈనెల 12న టెక్సాస్‌లోని ఇంటి ముందు తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా దీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీప్తి నార్త్ టెక్సాస్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీప్తి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాయాన్ని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని అతని సోదరుడు రవి అన్ని చర్యలు చేపట్టారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీప్తి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.ఆమె స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయాలు అయ్యాయి. ఆమె చికిత్స పొందుతోంది. కాగా దీప్తి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Next Story