వారికిస్తామన్న ఆర్థిక సాయం విషయంలో జగన్‌ సర్కార్ మోసం చేస్తోంది : టీడీపీ

Update: 2019-07-24 13:16 GMT

రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షం అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఒకలా వచ్చిన తర్వాత మరో వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. మాట తప్పం మడమ తిప్పం అంటూ ఎన్నికల ప్రచారంలో.. మేనిపెస్టోలో పేర్కొన్న జగన్‌ ఆచరణలో మాత్రం చూపించడంలేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. రైతు సమస్యలు, పెట్టుబడి సాయంపై ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు టీడీపీ సభ్యులు.

మధ్యాహ్నం వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది.. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడానికి అవకాశమివ్వనందుకు నిరసనగానే మధ్యాహ్నం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. చెప్పేది ఒకటి చేసేది మరోకటిలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య సూర్తికి విరుద్ధంగా వ్యహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు అసెంబ్లీ ప్రారంభానికి ముందు సభాహక్కులు కాపాడాలంటూ శాససనసభ ప్రధాన గేటు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఉపనేతలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ సభ్యులు .

మరో వైపు ప్రతిపక్ష సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇదే తంతుగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు. అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు మండిపడ్డారు.

రైతులకు ఇస్తామన్న ఆర్థిక సాయంలో జగన్‌ సర్కార్ మోసం చేస్తోందని టీడీపీ సభ్యులు.. కౌలు రౌతులకు భరోసా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమని చెప్పారు.

Similar News