ఏపీ అసెంబ్లీలో మరో నలుగురు టీడీపీ సభ్యులపై వేటు

Update: 2019-07-25 09:32 GMT

ఏపీ అసెంబ్లీలో మరో నలుగురు టీడీపీ సభ్యులపై వేటు పడింది. సభలో నినాదాలతో చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ అధికారపార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్‌ చర్యలు తీసుకున్నారు. బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేష్‌ కుమార్‌, బాలా వీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణబాబులను ఇవాళ సభ ముగిసేంతవరకు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోదావరి జలాలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఇందులో భాగంగానే జగన్‌ సమాధానం ఇస్తుండగా... టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఏపీ వనరులు తెలంగాణకు కట్టబెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు.

Similar News