తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజల ఆదరణ పొందిన అన్న క్యాంటీన్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నెలాఖరులో ఇవి మూతపడతాయని ప్రచారం జరుగుతోంది. అటు, అక్షయ పాత్ర వైఖరి కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను కొనసాగించాలని క్యాంటీన్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. జిల్లా మంత్రి అవంతిని కలిసి తమ భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని కోరారు.