కడప జిల్లా జమ్మలమడుగులో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. పెన్నా నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. ప్రతి రోజు పెన్నా నదిలోని ఇసుకను కర్నూలు జిల్లాకు ఎగుమతి చేసి లక్షలు దండుకుంటున్నారు. స్థానికుల నుంచి సమాచారమందుకున్న జమ్మలమడుగు పోలీసులు గోడూరు గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తోన్న 9ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాదారులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఒక్క జులై నెలలోనే పెన్నానదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తోన్న 30 ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని జమ్మలమడుగు డిఎస్పీ తెలిపారు. రెవెన్యూ,మైనింగ్, పోలీసు అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.