గ్రహణం వీడటంతో తెరుచుకోనున్న ఆలయాలు

Update: 2019-12-26 06:56 GMT

గ్రహణం వీడటంతో తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. ఆలయం శుద్ది, పుణ్యహావాచనం నిర్వస్తున్నారు. తోమాల, అరల్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గ్రహణం వీడటంతో.. స్వామి వారి పుష్కరిణలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. మరోవైపు అన్నవరం ఆలయం మధ్యాహ్నం 3 గంటలకు తెరువనున్నారు. బెజవాడ దుర్గ గుడి కూడా సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతిస్తారు. సింహాద్రి అప్పన్న ఆలయం సైతం సాయంత్రం 4 గంటలకు తెరువనున్నారు. శ్రీశైలం ఆలయంలో మహాసంప్రోక్షణ అనంతరం ఆలయం తెరుచుకోనుంది.

అటు.. సంప్రోక్షణ తర్వాత యాదాద్రి ఆలయం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. ఇప్పటికే బాసర సరస్వతి ఆలయం తెరుచకుంది. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మూసివేసిన అధికారులు.. సంప్రోక్షణ తర్వాత 3.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

Similar News