జగన్ ఈ మధ్య ఏం చేసినా సరే అదో పెద్ద రచ్చ అవుతోంది. మరీ ముఖ్యంగ ఆయన బయటకు వస్తున్నాడంటే చాలు.. ఏదో ఒక విపత్తు వచ్చినట్టే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా సరే జగన్ పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేయడం ఆపట్లేదు. ఆయన ఎక్కడికైనా వస్తున్నాడంటే చాలు.. అక్కడకు డబ్బులు ఇచ్చి మరీ వేల మందిని తెచ్చుకుంటున్నారు. ఆ వేల మంది రావడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగయ్య అనే కార్యకర్త ఏకంగా జగన్ కారు కిందే పడి చనిపోయాడు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి రైతుల మామిడి కాయలను వైసీపీ నేతలే దొంగిలించారు. మిర్చీయార్డులోనూ ఇదే జరిగింది. ఇక ఇప్పుడు తుఫాన్ వెళ్లిపోయాక రెండు రోజులకు జగన్ కు రైతులను పరామర్శించాలనే స్క్రిప్టు గుర్తుకు వచ్చింది.
పెలమలూరు, పెడన ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా తిరిగారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు స్టేజీలు వేసుకుని కాలికి మట్టి అంటకుండా నలుగురితో మాట్లాడి వెళ్లిపోయేవారు. పాపం అధికారం పోయిన తర్వాత ఆయన రైతులను పొలాల వద్దకు వెళ్లి పరామర్శించారు. పొలంలోకి చెప్పులు లేకుండా దిగి పరిశీలించాలని ఆయనకు ఇప్పుడే తెలిసినట్టు ఉంది. ఇక ఆయన పరామర్శ తర్వాత ఆయన చేసిన కామెంట్లు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన వారం పది రోజుల్లో సీఎం అయిపోతున్నట్టు.. కలెక్టర్లు సరిగ్గా పనిచేయకుండా పీకేస్తా అన్నారు. ఇది విన్న కలెక్టర్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే జగన్ ఇప్పుడు సీఎం అనుకుంటున్నాడా అని ఒకింత ఆలోచనలో పడ్డారు.
జగన్ కు ఇలాంటి వార్నింగులు ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో ఎంతో మంది అధికారులకు వార్నింగులు ఇస్తున్నారు. ఇక ఆయన పరామర్శల పేరుతో బలప్రదర్శనలు చేయడం ఇంకో విడ్డూరం. బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఈ బలప్రదర్శనలు అవసరమా అంటున్నారు ప్రజలు. ఈ బలప్రదర్శనల వల్లే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వీటి వల్ల.. ఓ చోట లాఠీ చార్జ్ జరిగింది, ఇంకో చోట దాడి జరిగింది, సింగయ్య ఏకంగా చనిపోయాడు. మొన్న పరామర్శలో కూడా జగన్ కాన్వాయ్ వాహనాలు ఢీ కొని కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా సరే జగన్ చేస్తున్న బలప్రదర్శనలు సామాన్య జనాలను, కార్యకర్తలను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి.