AP SPEAKER: వైసీపీ ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ద చర్యలు

ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ.. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతినెలా జీతం తీసుకుంటున్నారు ##

Update: 2025-11-06 02:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­సభ సమా­వే­శా­ల­కు రాని వై­సీ­పీ ఎమ్మె­ల్యే­ల­పై స్పీ­క­ర్ అయ్య­న్న పా­త్రు­డు చర్య­ల­కు సి­ద్ద­మ­వు­తు­న్నా­రు. రా­జ్యాంగ బద్దం­గా ఎలాం­టి చర్య­లు తీ­సు­కో­వా­ల­నే­ది పరి­శీ­లి­స్తు­న్న­ట్లు ఆయన తె­లి­పా­రు. అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­రు కాని 10 మంది YSRCP ఎమ్మె­ల్యే­లు ప్ర­తి నెల జీ­తా­లు తీ­సు­కుం­టు­న్నా­ర­ని అన్నా­రు. మాజీ ము­ఖ్య­మం­త్రి వై­ఎ­స్ జగన్ మో­హ­న్ రె­డ్డి మా­త్ర­మే జీతం తీ­సు­కో­వ­డం లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఈ వి­ష­యం­పై రా­జ్యాంగ బద్ధం­గా చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని, అసెం­బ్లీ­లో చర్చ­లు జరి­పి­స్తా­న­ని స్పీ­క­ర్ స్ప­ష్టం చే­శా­రు.  . జీతం తీ­సు­కు­ని డ్యూ­టీ చే­య­క­పో­తే ఉద్యో­గు­ల­ను సస్పెం­డ్‌ చే­స్తు­న్నా­మ­ని, ఉద్యో­గం నుం­చి తీ­సే­స్తు­న్నా­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. అటు­వం­టి­ది ఎమ్మె­ల్యే­ల­పై ఎం­దు­కు చర్య­లు తీ­సు­కో­కూ­డ­ద­ని స్పీ­క­ర్‌ అయ్య­న్న­పా­త్రు­డు ప్ర­శ్నిం­చా­రు. అసలు కో­డి­కి గు­డ్డు కి తేడా తె­లి­య­ని వై­సీ­పీ వా­ళ్ల గు­రిం­చి మా­ట్లా­డ­టం వే­స్ట్ అంటూ ఆయన మం­డి­ప­డ్డా­రు. రా­ష్ట్ర రా­జ­కీ­యా­లు భ్ర­ష్టు పట్టా­య­ని, రా­జ­కీ­యా­లు కా­స్ట్‌­లీ­గా మా­రి­పో­యా­య­ని కూడా వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ వి­ష­యం­పై అసెం­బ్లీ­లో చర్చ­లు జర­గ­ను­న్నా­య­ని, ప్ర­జల సమ­స్య­ల­పై చర్చిం­చా­లం­టూ వై­సీ­పీ ఎమ్మె­ల్యే­ల­కు సూ­చిం­చా­రు.   ఎమ్మె­ల్యే­లు జీ­తా­లు తీ­సు­కో­వ­డం­పై అసెం­బ్లీ­లో చర్చిం­చి ఎమ్మె­ల్యేల జీ­తా­లు ఆపి­వే­య­డం లేదా సస్పె­న్ష­న్‌­లు వి­ధిం­చ­డం వం­టి­వి జర­గ­వ­చ్చు. ఈ మధ్య అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో వై­సీ­పీ ఎమ్మె­ల్యే­లు హా­జ­రు కా­కుం­డా, ప్ర­జల సమ­స్య­లు చర్చిం­చ­క­పో­వ­డం పట్ల టీ­డీ­పీ నే­త­లు కూడా  తీ­వ్ర వి­మ­ర్శల చే­స్తు­న్నా­రు. స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు గతం­లో కూడా వై­సీ­పీ­పై తీ­వ్ర వ్యా­ఖ్య­లు చేసి, మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­ల­పై చు­ర­క­లు వే­సిన సం­ద­ర్భా­లు ఉన్నా­యి. ఈసా­రి జీ­తాల వి­ష­యం కీ­ల­కం­గా మా­రిం­ది.

రోజాపై హాట్ కామెంట్స్

మాజీ మం­త్రి, వై­సీ­పీ సీ­ని­య­ర్‌ నేత ఆర్కే రో­జా­పై హాట్ కా­మెం­ట్లు చే­శా­రు అయ్య­న్న­పా­త్రు­డు.. రోజా మా­ట­లు విం­టే మగ­వా­ళ్లే సి­గ్గు పడ­తా­ర­న్న ఆయన.. అటు­వం­టి­వి అన్నీ సెల్ ఫోన్ ల ద్వా­రా ప్ర­జ­ల్లో­కి వె­ళ్తు­న్నా­యి.. సి­ని­మా­ల­కు సె­న్సా­ర్ ఉన్న­ట్టే సెల్ ఫో­న్లు కు కూడా సె­న్సా­ర్ ఉం­డా­ల­నే అభి­ప్రా­యా­న్ని వ్య­క్తం చే­శా­రు.. ఆ ది­శ­గా మే­ధా­వు­లు పిల్ దా­ఖ­లు చే­యా­ల­ని సూ­చిం­చా­రు. మరో­వై­పు 2024 అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత వై­సీ­పీ ప్ర­తి­ప­క్షం­గా మా­రిం­ది. కానీ పది శాతం సీ­ట్లు రా­క­పో­వ­డం­తో ప్ర­తి­ప­క్ష నేత హోదా కోసం జగన్ న్యా­య­పో­రా­టం చే­స్తు­న్నా­రు. కానీ స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు వై­సీ­పీ­కి ప్ర­తి­ప­క్ష హోదా ఇచ్చేం­దు­కు అం­గీ­క­రిం­చ­డం లేదు. దీం­తో వై­సీ­పీ అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు బా­య్‌­కా­ట్ చే­స్తోం­ది. ఈ క్ర­మం­లో 11 మంది వై­సీ­పీ ఎమ్మె­ల్యే­లు  జగన్ సహా హా­జ­రు కా­వ­డం లేదు.  జగన్ తన జీ­తా­న్ని తీ­సు­కో­వ­డం లే­ద­ని, మి­గి­లిన 10 మంది తీ­సు­కుం­టు­న్నా­ర­ని స్పీ­క­ర్ చె­ప్పా­రు. 

"జగన్‌ది రాజకీయ డ్రామా"

మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ కృ­ష్ణా జి­ల్లా పర్య­టన అట్ట­ర్ ఫ్లా­ప్ అయిం­ద­ని మం­త్రి కొ­ల్లు రవీం­ద్ర ఎద్దే­వా చే­శా­రు. జగన్ పర్య­ట­న­లో ఎక్క­డా కూడా రై­తు­లు కని­పిం­చ­లే­ద­న్నా­రు. తాను పర్య­టి­స్తు­న్న ప్రాం­తా­ల్లో రై­తు­లు లేక పక్క గ్రా­మాల నుం­చి రై­తు­ల­ను తె­ప్పిం­చు­కు­ని జగన్ పబ్లి­సి­టీ స్టం­ట్లు చే­శా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. పొలం గట్ల మీద నడి­చి ఫో­టో­ల­కు స్టి­ల్స్ ఇచ్చా­ర­ని కా­మెం­ట్స్ చే­శా­రు. తు­ఫా­ను తీరం దా­టిన తొ­మ్మి­ది రో­జుల తర్వాత పరా­మ­ర్శ పే­రు­తో జగ­న్‌ రా­జ­కీయ డ్రా­మా సృ­ష్టిం­చా­ర­ని వ్యా­ఖ్య­లు చే­శా­రు.

Tags:    

Similar News