BYPOLL: ఉప ఎన్నిక పోరు.. ప్రచార హోరు

హోరాహోరీగా సాగుతున్న ప్రచారం.. రంగంలోకి దిగిన 3 పార్టీల అగ్ర నేతలు.. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటనలు... ఓటర్ల ప్రసన్నం కోసం పాదయాత్రలు

Update: 2025-11-06 06:30 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్నిక ప్ర­చా­రం హో­రా­హో­రీ­గా సా­గు­తోం­ది. ఎన్ని­కల బరి­లో ని­లి­చిన మూడు ప్ర­ధాన పా­ర్టీల నుం­చి ము­గ్గు­రు స్టా­ర్ క్యాం­పె­యి­న­ర్లు రం­గం­లో­కి దిగి వి­స్తృ­తం­గా ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. కాం­గ్రె­స్ అభ్య­ర్థి తర­పున సీఎం రే­వం­త్‌­రె­డ్డి, బీ­ఆ­ర్ఎ­స్ అభ్య­ర్థి తర­పున కే­టీ­ఆ­ర్), బీ­జే­పీ అభ్య­ర్థి తర­పున కేం­ద్ర­మం­త్రి కి­ష­న్ రె­డ్డి గె­లు­పే లక్ష్యం­గా ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. ఒక­రి­పై ఒకరు తీ­వ్ర స్థా­యి­లో వి­మ­ర్శ­లు చే­సు­కుం­టు­న్నా­రు. పా­ద­యా­త్రల ద్వా­రా ఓట­ర్ల­ను ప్ర­స­న్నం చే­సు­కు­నే పని­లో ని­మ­గ్న­మ­య్యా­రు. ప్ర­భు­త్వ పథ­కా­లు, సం­క్షేమ కా­ర్య­క్ర­మా­ల­ను వి­వ­రి­స్తూ కాం­గ్రె­స్ నే­త­లు, ప్ర­భు­త్వం­పై వి­మ­ర్శ­లు చే­స్తూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు, మాకు కూడా ఒక ఛా­న్స్ ఇవ్వా­ల­ని బీ­జే­పీ నే­త­లు క్షే­త్ర­స్థా­యి­లో పర్య­టి­స్తు­న్నా­రు. నవం­బ­ర్‌ 11న ఉప ఎన్నిక పో­లిం­గ్ జరు­గ­నుం­ది. నవం­బ­ర్‌ 14న ఓట్ల లె­క్కిం­పు చే­ప­ట్ట­ను­న్నా­రు. ప్ర­చా­రా­ని­కి మరో మూడు రో­జు­లు మా­త్ర­మే సమయం ఉం­డ­డం­తో ప్ర­ధాన పా­ర్టీ­ల­న్నీ ప్ర­చార జో­రు­ను మరింత పెం­చా­యి.

ప్రధాన పార్టీలకు సవాల్….!

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్నిక కాం­గ్రె­స్, బీ­జే­పీ, బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­ల­కు సవా­ల్ అనే చె­ప్పొ­చ్చు. ము­ఖ్యం­గా అధి­కా­రం­లో ఉన్న కాం­గ్రె­స్ పా­ర్టీ­కి అయి­తే ఈ వి­జ­యం ఎంతో అవ­స­ర­మ­న్న పరి­స్థి­తు­లు నె­ల­కొ­న్నా­యి. ఇక్కడ కానీ సీన్ రి­వ­ర్స్ అయి­తే... ప్ర­భు­త్వం­పై వ్య­తి­రే­కత ఉం­ద­న్న సం­కే­తా­లు మరింత బల­ప­డు­తా­యి. ఈ పరి­ణా­మం కా­స్త ప్ర­తి­ప­క్ష పా­ర్టీ­లైన బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ­ల­కు మరింత లాభం చే­కూ­ర్చే అవ­కా­శా­లు ఉం­టా­యి. ఇలాం­టి పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో కాం­గ్రె­స్ రెం­డే­ళ్ల పా­ల­న­కు ఈ ఉపఎ­న్నిక రె­ఫ­రెం­డం­గా­నే భా­విం­చ­వ­చ్చ­న్న వి­శ్లే­ష­ణ­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. అం­తే­కా­కుం­డా ఉప ఎన్ని­క­లో గె­ల­వ­లే­క­పో­తే అది ఆ పా­ర్టీ­పై­నా, ప్ర­భు­త్వం­పై­నా తీ­వ్ర ప్ర­భా­వం చూ­ప­డం ఖా­య­మ­న్న అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. జూ­బ్లీ­హి­ల్స్ గె­లి­చి నగ­రం­లో పట్టు పెం­చు­కో­వ­టం­తో పాటు ప్ర­తి­ప­క్షా­లు చే­స్తు­న్న వి­మ­ర్శ­లు, ఆరో­ప­ణ­ల­కు సరైన బదు­లి­వ్వా­ల­ని కాం­గ్రె­స్ భా­వి­స్తోం­ది. సీఎం రే­వం­త్ రె­డ్డి కా­ర్న­ర్ మీ­టిం­గ్స్ తో పాటు రోడ్ షోలు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ తో పాటు బీ­జే­పీ­పై తీ­వ్ర­స్థా­యి­లో వి­మ­ర్శ­లు గు­ప్పి­స్తు­న్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ లో కాం­గ్రె­స్ పా­ర్టీ­కే అవ­కా­శం ఇవ్వా­ల­ని… ని­యో­జ­క­వ­ర్గా­న్ని అన్ని వి­ధా­లా అభి­వృ­ద్ధి చూసి చూ­పి­స్తా­మ­ని కో­రు­తు­న్నా­రు.

బరిలోకి దిగిన అగ్ర నేతలు

మూడు పా­ర్టీల తర­ఫున అగ్ర­నే­త­లు ప్ర­చా­రం సా­గి­స్తు­న్నా­రు. కాం­గ్రె­స్‌ తర­ఫున సీఎం రే­వం­త్‌ రం­గం­లో­కి దిగి రో­డ్‌ షోలు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. నా­లు­గు రో­జు­లు రో­డ్‌ షోలు, రెం­డు రో­జు­లు బై­క్‌ ర్యా­లీ­లు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. మరో­వై­పు ప్ర­తి డి­వి­జ­న్‌ ప్ర­చార బా­ధ్య­త­ల­ను ఇద్ద­రే­సి మం­త్రు­ల­కు అప్ప­గిం­చా­రు. ప్ర­తి 10 పో­లిం­గ్‌ కేం­ద్రాల బా­ధ్య­త­ను ఓ ఎమ్మె­ల్యే­కు ఇచ్చా­రు. వం­దే­సి­మం­ది ఓట­ర్ల­ను కల­వా­ల­ని స్థా­నిక నే­త­ల­కు ని­ర్దే­శిం­చా­రు. ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా ప్ర­చా­రం సా­గి­స్తు­న్నా­రు. అభి­వృ­ద్ధి, సం­క్షే­మం ఎజెం­డా­గా సీఎం ప్ర­చా­రం ని­ర్వ­హి­స్తు­న్నా­రు. భారత రా­ష్ట్ర సమి­తి తర­ఫున కే­టీ­ఆ­ర్‌ రో­డ్‌ షోలు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌ ము­ఖ్య నా­య­కు­ల­తో సమా­వే­శం ని­ర్వ­హిం­చి గె­లు­పు కోసం కృషి చే­యా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. పితృ వి­యో­గం వల్ల మాజీ మం­త్రి హరీ­శ్‌­రా­వు ప్ర­చా­రా­ని­కి దూరం అయ్యా­రు. భా­జ­పా తర­ఫున కేం­ద్ర­మం­త్రి జి.కి­ష­న్‌­రె­డ్డి వి­స్తృ­తం­గా పర్య­టి­స్తు­న్నా­రు. 

కేటీఆర్ రోడ్ షోలు….

ఇక్కడ సీటు గె­ల­వ­ట­మ­నే­ది బీ­ఆ­ర్ఎ­స్ కు అత్యంత ము­ఖ్యం­గా మా­రి­పో­యిం­ది. ఇది వారి సి­ట్టిం­గ్ స్థా­నం. వరు­స­గా ఇక్కడ వి­జ­యా­లు సా­ధిం­చిన బీ­ఆ­ర్ఎ­స్... ఈ ఉపఎ­న్ని­క­లో గె­లి­చి సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని ని­ల­బె­ట్టు­కో­వా­లని చూస్తోంది. ఓవై­పు ప్ర­భు­త్వం­పై తీ­వ్ర­స్థా­యి­లో వ్య­తి­రే­కత ఉం­ద­ని ఆ పా­ర్టీ నే­త­లు పదే పదే చె­బు­తు­న్నా­రు. ఇలాం­టి పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో ఇక్కడ గె­లి­స్తే­నే... అధి­కార కాం­గ్రె­స్ పై మరింత పో­రా­డేం­దు­కు స్కో­ప్ దొ­రి­కే అవ­కా­శం స్ప­ష్టం­గా ఉం­టుం­ది.

వేగం పెంచిన బీజేపీ…!

బీ­జే­పీ కూడా ప్ర­చా­రం­లో వేగం పెం­చిం­ది. కా­ల­నీ­ల్లో ఓట­ర్ల ఇం­టి­కి పా­ద­యా­త్ర­గా వె­ళు­తోం­ది. కా­ర్పె­ట్‌ బాం­బిం­గ్‌ అంటూ కొ­త్త తరహా ప్ర­చా­రా­ని­కి తె­ర­తీ­సిం­ది. కేం­ద్ర­మం­త్రి కి­ష­న్ రె­డ్డి రోడ్ షోలు కూడా ని­ర్వ­హి­స్తు­న్నా­రు. పా­ర్టీ­లో­ని కీలక నే­త­లం­తా కూడా ప్ర­చా­రం­లో ఉం­టు­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ ఏం చే­య­లే­ద­ని… కాం­గ్రె­స్ కూడా వి­ఫ­ల­మైం­ద­ని కమలం పా­ర్టీ నే­త­లు ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. బీ­జే­పీ అభ్య­ర్థి­కే తమ మద్ద­తు ఉం­టుం­ద­ని జన­సేన పా­ర్టీ ప్ర­క­టిం­చిం­ది.

Tags:    

Similar News