CAA విషయంలో కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుంది : సీఎం కేసీఆర్

Update: 2020-01-25 20:42 GMT

CAA విషయంలో కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుందని... దీన్ని వందకు వంద శాతం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు కేసీఆర్. అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. కలిసి వచ్చే ముఖ్యమంత్రులు, నేతలతో హైదరాబాద్‌లో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. CAA బిల్లుపై పుణరాలోచన చేసి... వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు సీఎం కేసీఆర్. ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా...TRS సెక్యూలర్ విధానానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. CAA బిల్లును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని కొట్టేయాలని అన్నారు.

Similar News